పరత్వాది పంచకము

గ్రంధకర్త: శ్రీ వరదగురువులు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

ప్రతిదినము ఉదయమున శ్రీ వరదగురువులు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమును తెలుపు “పరత్వాది పంచక”మను ఈ ఉత్తమమైన స్తోత్రమును ఎవరు అనుసంధింతురో వారికి నిష్కల్మషమైన భక్తి సిద్ధించును. శ్రీశుని యందు అవిచ్ఛిన్న ప్రేమ లభించును.

శ్లోకాలు          1 - 6       

ఓం అస్మద్ గురుభ్యో నమః

1    Click to Play the sloka       
ఉద్య ద్భానుసహస్ర భాస్వర పరవ్యోమాస్పదం నిర్మల
జ్ఞానానంద ఘన స్వరూప మమల జ్ఞానాదిభి ష్షడ్గుణైః |
జుష్టం, సూరిజనాధిపం, ధృత రథాంగాబ్జాది భూషోజ్జ్వలం
శ్రీ భూ సేవ్య మనంతభోగి నిలయం శ్రీ వాసుదేవం భజే ||
2    Click to Play the sloka       
ఆమోదే భువనే ప్రమోద ఉత సమ్మోదే చ సంకర్షణం
ప్రద్యుమ్నం చ తథా೭నిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితీః |
కుర్వాణా న్మతి ముఖ్య షడ్గుణవరై ర్యుక్తాన్ త్రియుగ్మాత్మకైః
వ్యూహాదిష్ఠిత వాసుదేవ మపి తం క్షీరాబ్ధినాథం భజే ||
3    Click to Play the sloka       
వేదాన్వేషణ, మందరాద్రి భరణ, క్ష్మోద్ధారణ, ప్రశ్రిత
ప్రహ్లాదావన, భూమిభిక్షణ, జగద్విక్రాంతయో యత్ర్కియాః |
దుష్టక్షత్ర నిబర్హణం, దశముఖాద్యున్మూలనం, కర్షణం
కాళింద్యా, అతిపాప కంస నిధనం యత్ర్కీడితం తం నుమః ||
4    Click to Play the sloka       
యో దేవాది చతుర్విధేషు జనిషు బ్రహ్మాండ కోశాంతరే
సంభక్తేషు చరాచరేషు చ విశన్ ఆస్తే సదా న్తర్బహిః |
విష్ణు స్తం నిఖిలే ష్వణు ష్వణుతరం భూయస్సు భూయస్తరం
స్వాంగుష్ఠ ప్రమితం చ యోగిహృదయే ష్వాసీన మీశం భజే ||
5    Click to Play the sloka       
శ్రీ రంగస్థల వేంకటాద్రి కరిగిర్యాదౌ శతే೭ష్టోత్తరే
స్థానే గ్రామ నికేతనేషు చ సదా సాన్నిధ్య మాసేదుషే |
అర్చారూపిణ మర్చకాభిమతిత స్స్వీకుర్వతే విగ్రహం
పూజాం చాఖిలవాంఛితా న్వితరతే శ్రీ శాయ తస్మైనమః ||
6    Click to Play the sloka       
ప్రాత ర్విష్ణోః పరత్వాది పంచకస్తుతి ముత్తమామ్ |
పఠన్ ప్రాప్నోతి భగవద్భక్తిం వరదనిర్మితాం ||
శ్లోకాలు         1 - 6