ధాటీపంచకమ్

గ్రంధకర్త: దాశరథి/ముదలియాండాన్

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

భగవద్రామానుజుల శిష్యులు ముదలియాండన్. వీరిపేరు దాశరథి. వీరందించిన స్తోత్రమే ధాటీపంచకము. ధాటీ అంటే దాడి. శ్రీభాష్యకారులు వేదబాహ్యమతాలపై దాడిచేశారు. అంటే వేదప్రతిష్ఠాపనాచార్యులుగా వైదికసిద్ధాంతాన్ని, శ్రీమన్నారాయణ పరత్వాన్ని స్థిరంగా స్థాపించారు. ఆ భావాన్ని, యతిరాజ వైభవాన్ని ఐదుశ్లోకాలలో చెప్పడం వలన ఇది ధాటీపంచకము అని ప్రసిద్ధిని పొందింది.

శ్లోకాలు          1 - 6       
   Click to Play the sloka       
పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయా|
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహమ్||
1    Click to Play the sloka       
పాషండ ద్రుమషండదావదహనః చార్వాకశైలాశనిః
బౌద్ధధ్వాన్త నిరాస వాసరపతిః జైనేభ కంఠీరవః|
మాయావాది భుజంగ భంగగరుడః త్రైవిద్యచూడామణిః
శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోఽయం మునిః||
2    Click to Play the sloka       
పాషండషండ గిరిఖండన వజ్రదండాః
ప్రచ్ఛన్నబౌద్ధ మకరాలయమంథదండాః|
వేదాంతసార సుఖదర్శన దీపదండాః
రామానుజస్య విలసంతి మునే స్త్రిదండాః||
3    Click to Play the sloka       
చారిత్రోద్ధారదండం చతురనయపథాలంక్రియా కేతుదండం
సద్విద్యా దీపదండం సకలకలికథాసంహతేః కాలదండమ్|
త్రయ్యన్తాలమ్బదండం త్రిభువన విజయ చ్ఛత్ర సౌవర్ణదండం
ధత్తే రామానుజార్యః ప్రతికథక శిరోవజ్రదండం త్రిదండమ్||
4    Click to Play the sloka       
త్రయ్యా మాంగల్యసూత్రం త్రియుగయుగపథారోహణాలంబ సూత్రం
సద్విద్యాదీపసూత్రం సకలకలికథాసంహతేః కాలసూత్రమ్|
ప్రజ్ఞాసూత్రం బుధానాం ప్రశమథన మనః పద్మినీనాల సూత్రం
రక్షాసూత్రం మునీనాం జయతి యతిపతే ర్వక్షసి బ్రహ్మసూత్రమ్||
5    Click to Play the sloka       
పాషండసాగర మహాబడబాముఖాగ్నిః
శ్రీరంగరాజ చరణాంబుజ మూలదాసః|
శ్రీవిష్ణులోక మణిమండప మార్గదాయీ
రామానుజో విజయతే యతిరాజరాజః||
శ్లోకాలు         1 - 6